హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీసీలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ ఆర్‌ఎంలు, 48 మంది డిపో మేనేజర్లు, జూనియర్ స్కేల్ ఆఫీసర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ శనివారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎం. రాజేశేఖర్‌ను ఐటీ అండ్ లీగల్ సెల్‌కు, సీహెచ్ కన్నను మెడికల్ విభాగానికి బదిలీ చేశారు. డిప్యూటీ ఆర్‌ఎంలు బి. వెంకారెడ్డిని హెడ్ ఆఫీస్‌లో డిప్యూటీ సీటీఎంగా, పి. జ్యోతిని నిజామాబాద్, ఎస్. మధుసూదన్‌ను మెదక్ , జి. జగన్‌ను మహబూబ్‌నగర్ డిప్యూటీ ఆర్‌ఎంలుగా ట్రాన్స్‌ఫర్ చేశారు.
