- 1 నుంచి 9వ తరగతి ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 2025--–-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్ఏ-–2) వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 10 నుంచి 20 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం పూర్తి చేసి, ఏప్రిల్ 23న విద్యార్థుల ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. అదే రోజు బడుల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి, పేరెంట్స్‌కు ఫలి తాలు తెలియజేయాలని స్పష్టం చేశారు.
