కాఫీ ఎగుమతుల్లో తెలంగాణ 54% వృద్ధి

కాఫీ ఎగుమతుల్లో తెలంగాణ 54% వృద్ధి

మహమ్మారి సమయంలో, కాఫీ ఎగుమతుల్లో తెలంగాణ 54% వృద్ధిని చవిచూసిందని డ్రిప్ కాపిటల్ నివేదిక వెల్లడించింది. FY20 నాటికి ఇన్స్టంట్ కాఫీ ఎగుమతి పరిమాణం 10 సంవత్సరాలకు 4% CAGR మేరకు పెరిగింది. ఎగుమతి విలువ 8% CAGR మేరకు పెరిగింది.  ఈ సందర్బంగా డ్రిప్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకులు, CEO, పుష్కర్ ముకేవర్ మాట్లాడుతూ..మార్కెట్లో ఈ రకమైన కాఫీ పట్ల ప్రపంచవ్యాప్త ప్రశంసలు అధిక ధరను పొందడంలో సహాయపడతాయన్నారు. కాబట్టి  భారత ఎగుమతిదారులు తమ ప్రపంచ మార్కెట్ వాటాను పెంచుకోవటానికి ఇన్స్టంట్ కాఫీ ఎగుమతి మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న ధోరణులతో పాటు వెళ్ళాలన్నారు. అలాగే అనేక కాఫీ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ను అనుకరించడం ద్వారా అనేక ఇతర రాష్ట్రాలు ప్రయోజనం పొందవచ్చన్నారు.