Education : స్కూల్ బ్యాగుల బరువు ఇంతే ఉండాలి.. డిసైడ్ చేసిన సర్కార్

Education : స్కూల్ బ్యాగుల బరువు ఇంతే ఉండాలి.. డిసైడ్ చేసిన సర్కార్

బడికి వెళ్లే విద్యార్థులను చూస్తే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి వారి బ్యాగులే.. పాపం పట్టుమని  పదేళ్లు కూడా ఉండవు కానీ 30 కేజీల బ్యాగ్ ను భుజాలపై మోస్తారు. ముఖ్యంగా ప్రైవేట్‌ స్కూళ్ల యాజమన్యాలు ఇష్టం వచ్చినట్లు పుస్తకాలను అంటగడుతున్నాయి. స్కూ్ల్ నుంచి ఇంటికి రాగానే విద్యార్థులు  నీరసపడిపోతున్నారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి  విద్యార్థుల బ్యాగులు కనీసం 25 శాతం మేర తేలికకానున్నాయి.  

1వ  తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాల బరువు 4.5 కేజీల నుంచి 3.5 కేజీలకు తగ్గనుంది.  పుస్తకాల పేపర్ సైజ్ 90 GSM నుంచి 70 GSMకు తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయించింది.  ప్రస్తుతం ఈ  ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.  ఒకవేళ అనుమతి ఇస్తే బడి సంచి బరువు దాదాపుగా 30 శాతం తగ్గవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.  


ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 

  • 1వ  తరగతి నుంచి 2వ తరగతి  వరకు 1.5 కేజీల బరువు 
  • 3వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు 2 నుంచి 3 కేజీల బరువు  

సెంకడరీ స్కూల్ విద్యార్థులకు 

  • 6 తరగతి నుంచి 8 వ తరగతి వరకు 4 కేజీల బరువు 
  • 8 తరగతి నుంచి 9 వ తరగతి వరకు 4 .50 కేజీల బరువు 
  • పదో తరగతి విద్యార్థులకు 5 కేజీల బరువు లోపు ఉండాలని విద్యాశాఖ   ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది.