నవంబర్ 29,30 నా హైదరాబాద్ లో స్కూలకు సెలవు

నవంబర్ 29,30 నా హైదరాబాద్ లో స్కూలకు సెలవు

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఇయ్యాల, రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. 29న స్కూళ్లలో ఎన్నికల ఏర్పాట్లు, 30న పోలింగ్ ఉండటం, చాలా మంది టీచర్లు ఎన్నికల డ్యూటీలో ఉండటంతో రెండ్రోజులు సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాశాఖను ఆదేశించారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లకు రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1న తిరిగి యధావిధిగా స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. 

నిమ్స్ హాస్పిటల్​కు సెలవు 

పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న గురువారం నిమ్స్​హాస్పిటల్ కు సెలవు ప్రకటించినట్లు పీఆర్వో సత్య గౌడ్ తెలిపారు. అయితే, ఎమర్జెన్సీ విభాగం అందుబాటులో ఉంటుందన్నారు. శుక్రవారం నుంచి ఆస్పత్రిలో అన్ని సేవలు  యధావిధిగా నడుస్తాయన్నారు.