
- ఈసీ అంటే లెక్క లేదా?
- ఇష్టానికి కోడ్ ఉల్లంఘనలా?
- ఎంపీపీ, జడ్పీలకు ఫండ్స్ పై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం
- ఎన్నికల కోడ్ విధిగా పాటించాలని లేఖ
- లేదంటే తీవ్ర నిర్ణయాలు తప్పవని హెచ్చరించింది: సీఈఓ
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ కోడ్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానికి ఉల్లంఘిస్తోందని ఈసీ సీరియస్అయింది. కోడ్ ను పక్కాగా అమలు చేయాల్సిన ఉన్నతాధికారులే దాన్ని పాటించకుండా ఓటర్లను ప్రలోభపెట్టే నిర్ణయాలు తీసుకోవడం సహించరానిదంటూ తీవ్రంగా హెచ్చరించింది. రెండున్నరేండ్లుగా ఇవ్వని ఎంపీపీ, జడ్పీ నిధులను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల వేళ ఈ నెల 4న ప్రభుత్వం రిలీజ్చేసింది. దీనిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దాంతో టీఆర్ఎస్ సర్కారుకు, ఉన్నతాధికారులకు ఈసీ మరోసారి చీవాట్లు పెట్టింది. సెక్రటేరియేట్‌లోని శాఖలన్నీ కోడ్ ను పక్కాగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఈసీ లేఖ రాసింది. దాని ఆధారంగా సీఈఓ శశాంక్ గోయల్ఆర్డర్స్ఇచ్చారు. ఎంపీపీ, జడ్పీలకు ఫండ్స్‌పై నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్డిపార్ట్మెంట్ను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగానే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల జీతాలు పెంచుతూ జీవో ఇవ్వడంపై సీఎస్సోమేశ్ కుమార్, స్పెషల్‌సీఎస్ అరవింద్ కుమార్, సెక్రటరీ సుదర్శన్‌రెడ్డిలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. నేరుగా ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. వారి సర్వీసు రికార్డుల్లో చార్జ్ నమోదు చేయాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది.కోడ్ఉన్నప్పుడు విధాన నిర్ణయాలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అనుమతి తప్పనిసరి. కానీ మొన్నటి హుజూరాబాద్ బై పోల్ లో, ప్రస్తుత ఎమ్మెల్సీఎన్నికల్లో పలు నిర్ణయాలు ఈసీ పర్మిషన్ లేకుండానే తీసుకున్నారు. దీన్నే ఈసీ తన హెచ్చరిక లేఖలో ప్రస్తావించింది. ఓటర్లు ప్రభావితమయ్యే ఇష్యూల్లో కూడా నిర్ణయాలకు ముందు తమనుంచి ఎలాంటి అనుమతీ తీసుకోవడం లేదని ఆగ్రహించింది. ఇలాగే వ్యవహరిస్తే నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయని ఈసీ హెచ్చరించినట్లు సీఈఓ గోయల్ ‘వెలుగు’తో అన్నారు.
క్రాస్ ఓటింగ్భయంతోనేనా!
స్థానిక సంస్థల కోటాలో 6 ఏకగ్రీవాలు పోను ఎలక్షన్ జరుగుతున్న మిగతా 6 చోట్ల టీఆర్ఎస్ ను రెబ్సల్ బెడద, క్రాస్ఓటింగ్భయం వెన్నాడుతోంది. అందుకే ఓటర్లయిన కార్పొరేటర్లకు జీతాల పెంపు, ఎంపీపీ, జడ్పీలకు నిధుల విడుదల ద్వారా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారంటున్నారు. కాగా రెండేండ్ల కింద ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధుల జారీ లేక ఉత్సవ విగ్రహాలుగా మిగిలారనే విమర్శలున్నాయి.