ర‌కుల్‌ని కాపాడేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది

ర‌కుల్‌ని కాపాడేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది

బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్యెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన భేటీ పడవో భేటీ బచావో పథకానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కు డ్ర‌గ్ కేసులో హైదరాబాద్ కు లింకులు ఉన్నాయని ఆయన వివరించారు.

గతంలో హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ కుంభకోణంలో అనేక మంది సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారన్న సంప‌త్… వారిపై రోజుల తరబడి విచారణ జరిపి తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా కేసును తొక్కేశార‌న్నారు. ఇప్పుడు బొంబాయి డ్రగ్స్ మాఫియా కేసు లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని, ఆమె తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు.ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసు లోతైన విచారణ జరిపితే ప్రభుత్వ పెద్దలు బాగోతాలు లు బయట పడతాయని సంప‌త్ అన్నారు