ఆర్టీసీ జేఏసీ బంద్ తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ సిటీ బస్సులతో సహా సిటీ నుంచి వివిధ జిల్లాకు వెళ్లే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో సిటీ వ్యాప్తంగా ఎంజీబీఎస్, జేబీఎస్ ,దిల్ సుఖ్ నగర్, ఇతర సిటీ బస్టాండ్లు ప్రయాణికులు లేకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజారవాణాకు ప్రజలు ప్రత్యామ్నాయంగా మెట్రో రైళ్లను ఎంచుకోవడంతో సిటీలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సిటీ వ్యాప్తంగా అన్ని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె హైదరాబాద్ నగర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలుగా మెట్రో రైళ్లను ఎంచుకుంటున్నారు, దీంతో ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్ లోని అన్ని మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి. దిల్ సుఖ్ నగర్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, జేబీఎస్, అమీర్ పేట్, మాదాపూర్ మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సర్కార్ ఉద్యోగులకు సమానంగా పీఆర్సీ, పెన్షన్ , ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం (ఏప్రిల్22) అర్థరాత్రినుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె ప్రభావంతో బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బుధవారం ఉదయం నుంచే బస్టాప్ లు, బస్టాండ్ల దగ్గర ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. బస్సులు నడవక ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవులను ఉపయోగించుకుని స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది.
అయితే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. అద్దె బస్సులను యధావిధిగా నడుస్తు్న్నాయి. అయితే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. హైదరాబాద్ సిటీలో పోలీస్ బందోబస్తుతో బస్సులను డిపోలనుంచి పంపిస్తోంది. రోడ్లపైకి వచ్చిన బస్సులను సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.

