
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీటెట్) ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in లేదా https://tgtet.aptonline.in ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
టీజీ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు టెట్ పేపర్–1కు మొత్తంగా63,261 మందికి గానూ 47,224 (74.65%), పేపర్– 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 66,686 మందికి 48,998 మంది (73.48%), సోషల్ స్టడీస్ లో 53,706 మందికి గానూ 41,207 మంది (76.73%) హాజరయ్యారు.