హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు ఆధునిక గోశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీజీఎల్‌డీఏ) చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. ఎనికపల్లిలో 99 ఎకరాల విస్తీర్ణంలో, వేములవాడలో 100 ఎకరాల విస్తీర్ణంలో, యాదగిరిగుట్ట, వెటర్నరీ వర్సిటీలో మరో రెండు గో శాలలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల గోశాల నిర్వాహకులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగానే సరికొత్త గోశాలల ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు.
