51 సంచార జాతులకు ‘డి-నోటిఫైడ్ ట్రైబ్స్’ హోదా..త్వరలో గెజిట్ విడుదల: పొన్నం   

51 సంచార జాతులకు ‘డి-నోటిఫైడ్ ట్రైబ్స్’ హోదా..త్వరలో గెజిట్ విడుదల: పొన్నం   

హైదరాబాద్, వెలుగు: ​రాష్ట్రంలోని 51 సం చార జాతులకు 'డి-నోటిఫైడ్ ట్రైబ్స్' (డీఎన్టీ) హోదా కల్పిస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి త్వరలో గెజిట్ నోటి ఫికేషన్ విడుదల చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయ న  వివరాలను వెల్లడించారు. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు పలు కులాల పేర్లను గౌరవప్రదంగా మార్పు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

 ఇకపై ‘పిచ్చకుంట్ల’ కులం ‘వంశ రాజ్’గా,  ‘దొమ్మర’ కులం ‘గడ వంశీయ’గా పేర్లు మార్చారు. ‘శూద్ర కులం’ పేరును ఇకపై 'తమ్మలి'గా,  ‘బుడబుక్కల’ కులానికి ‘శివ క్షత్రియ’గా నామకరణం చేశా రు. ‘మేర’ కులానికి ‘మేరు’ అనే పదాన్ని చేర్చా రు. వన్నార్ స్థానంలో ‘ధోబీ’ని చేర్చి.. రజక, చాకలి, ధోబీలుగా గుర్తించారు. సంచార జాతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ ‘సీడ్’ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్​నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.