- వాహనదారులు రవాణా శాఖ ఆఫీసుకు రాకుండానే సేవలు పొందే అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలను మరింత విస్తృతపరిచేందుకు ఫేస్‌లెస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన అధికారులు.. ఫేస్‌లెస్ సేవలు అందుబాటులోకి రావడంతో వాహనదారులను ఇక నుంచి ఆర్టీఏ ఆఫీసుకు రాకుండానే తమకు అవసరమైన అన్ని రకాల సేవలను పొందే అవకాశం ఉంటుందన్నారు.
దీని ద్వారా లెర్నింగ్, పర్మనెంట్ లైసెన్స్‌లో పేరు, అడ్రస్, ఫొటో, సంతకం మార్పు, రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పౌర సేవలను వేగవంతంగా, పారదర్శకంగా పొందేందుకు వీలుగా ఈ ఫేస్‌లెస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవల్లో ఫేస్‌లెస్ సేవలు ప్రారంభించడం ఓ మైలురాయిగా అధికారులు అభివర్ణించారు.
