తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ పాలిసెట్‌-2021 ఫలితాలు ఇవాళ విడుదలైయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం రిజల్ట్స్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్షను ఈనెల 17న నిర్వహించింది. మొత్తం 1,02,496 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వివరాలు నమోదు చేసుకోగా.. 92,557 మంది హాజరయ్యారు. వీరిలో 75,666 (81.75%) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్‌  రిలీజ్ చేశారు.
 
మొదటి విడత షెడ్యూల్ :
ఆగస్టు 5 నుంచి ప్రవేశాలు చేపట్టనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు ఆగస్టు 5 నుంచి 9 వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశమిచ్చారు. ఆగస్టు 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఆగస్టు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లు, ఆగస్టు 14న సీట్ల కేటాయింపు జరుగనుంది.

రెండో విడత షెడ్యూల్‌:

పాలిసెట్‌ కౌన్సెలింగ్  ఆగస్టు 23, 2021 వరకు జరగనుంది.సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ స్లాట్‌ బుకింగ్ ఆగస్టు 23, 2021. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆగస్టు 24, 2021 వరకు చేపట్టనున్నారు.ఆగస్టు 24, 25 వరకు వెబ్‌ ఆప్షన్లు, పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయింపు ఆగస్టు 27న జరగనుంది.