
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ యంగ్ టెన్నిస్ ప్లేయర్ యమలపల్లి సహజ షోలాపూర్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ విమెన్స్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్ చేరుకుంది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో సహజ 7–-6(3), 6–-2తో జపాన్‌కు చెందిన సాకి ఇమామురపై వరుస సెట్లలో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఎకతరీనా మకరోవా (రష్యా)తో సహజ పోటీ పడనుంది.