రోడ్డు వేయాలంటూ మానకొండూరు ప్రజల నిరసన

రోడ్డు వేయాలంటూ మానకొండూరు ప్రజల నిరసన

కరీంనగర్: తమ కాలనీలో రోడ్డు వేయాలంటూ మానకొండూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు నిరసనకు దిగారు. తూర్పు దర్వాజా చౌరస్తాలో రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. స్థానిక ఎమ్మెల్యే,  రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు రోడ్డు పై నుంచి లేవబోమంటూ నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఎమ్మెల్యే, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తే రోడ్లన్నీ చిత్తడిగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతోందన వాపోయారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని చెప్పారు. అయితే చివరికి రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి 20 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసనను విరమించారు.