T20 ఉమెన్స్ వరల్డ్ కప్: భారత జట్టులో తెలంగాణ అమ్మాయి

T20 ఉమెన్స్ వరల్డ్ కప్: భారత జట్టులో తెలంగాణ అమ్మాయి

ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళల టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి అరుంధతిరెడ్డి చోటు దక్కించుకుంది. మిథాలీ రాజ్ తర్వాత ICC టోర్నీలో ఆడనున్న తెలుగు అమ్మాయిగా అరుంధతి రికార్డులకెక్కింది. పేసర్ అయిన 22 ఏళ్ల అరుంధతి 2018లోనే T20ల్లో ఎంట్రీ ఇచ్చింది. 14 మ్యాచుల్లో11 వికెట్లు తీసింది.

ఫిబ్రవరి  21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న T20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. 15 మంది సభ్యులతో విడుదల చేసిన ఈ లిస్టులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 16 ఏళ్ల రిచా ఘోష్ మాత్రమే కొత్త ప్లేయర్. అంతేకాదు ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న టీనేజ్ సెన్షేసన్ షెఫాలీ వర్మ కూడా మొదటి సారిగా ఐసీసీ టోర్నీ ఆడబోతోంది. టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నాహకంగా ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే ముక్కోణపు టోర్నీ కోసం కూడా భారత జట్టును ఎంపిక చేశారు.