హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2025-–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల30న, మే 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు గురువారం తెలిపారు.
ఏప్రిల్ 30న హైదరాబాద్ ప్రాంగణంలోని సంగీతం, జానపద కళల కోర్సుల అభ్యర్థులకు.. వరంగల్ ప్రాంగణంలోని జానపద గిరిజన విజ్ఞాన పీఠం అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు జరుగుతాయన్నారు. మే1న తెలుగు సాహిత్య శాఖకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలని రిజిస్ట్రార్ సూచించారు.

