కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్లకు త్వరలో టెండర్లు

కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్లకు త్వరలో టెండర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్​లకు సంబంధించి త్వరలో పనులు షురూ కానున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం ఎంత అవుతుందన్నది యైటీస్ కన్సల్టెన్సీ నెలరోజుల్లో ఫైనల్ చేయనుంది. ఆ తరువాత జీహెచ్ఎంసీ అధికారులు ఇందుకు సంబంధించి టెండర్లు కాల్ చేయనున్నారు. ఆ తరువాత పనులు స్టార్ట్ అయ్యే అవకాశముంది.

దాదాపు రెండు నుంచి మూడునెలల్లో పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  పార్కు చుట్టూ రూ. 826 కోట్లతో 6 జంక్షన్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ నిధులు సరిపోతాయా? లేదా అన్నది కన్సల్టెన్సీ ఫైనల్ చేశాక తెలుస్తుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తారు. రెండో విడత ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్‌‌‌‌‌‌‌‌ పాస్ ల నిర్మాణం చేపడతారు.