- డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్
వాషింగ్టన్/మాస్కో: ఇరాన్ మీద అమెరికా సైనిక చర్యకు దిగితే నష్టం ఆయా ప్రాంతాలకే పరిమితం కాదని, మొత్తం ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను ఫోన్ లో పుతిన్ హెచ్చరించారు. బుధవారం ఇరువురు దేశాధినేతలు దాదాపు గంటన్నరపాటు మాట్లాడుకున్నారని మాస్కో వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతానికి ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఈ విరామం వల్ల శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందని, ఉద్రిక్తతలు తగ్గడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దౌత్యపరమైన పరిష్కారాల కోసం రష్యా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెబుతూనే, రెచ్చగొట్టే చర్యలకు దిగితే మాత్రం అంతర్జాతీయ సుస్థిరత దెబ్బతింటుందని హెచ్చరించారు.
