
శ్రీరామ్, అవికా గోర్ జంటగా ‘గరుడవేగ’ అంజి రూపొందించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో అచ్యుత రామారావు, రవితేజ మన్యం నిర్మించిన ఈ మూవీ జులై 1న రిలీజవుతోంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గెస్ట్‌గా వచ్చిన హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. శ్రీరామ్ మాట్లాడుతూ ‘టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే 96, నా ఆటోగ్రాఫ్ చిత్రాల్లోని ఫీల్ కలుగుతోందని చెప్పడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలోని స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తుంది’ అని చెప్పాడు. తమకు సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు దర్శకుడు అంజి. ఈ కథతో ప్రతి ఒక్కరూ కనెక్టవుతారన్నారు నిర్మాతలు. సీనియర్ దర్శకులు బి.గోపాల్, సినిమాటోగ్రాఫర్స్ ఎస్.గోపాల్ రెడ్డి, సెంథిల్ కుమార్, చోటా కె నాయుడు బెస్ట్ విషెస్ చెప్పారు. శివ బాలాజీ, శ్రీనివాస రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, సింగర్ శ్రీరామచంద్ర కూడా పాల్గొన్నారు.