అమెరికాలో భారతీయులపై వ్యతిరేకత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరుగుతున్న ఈ ధోరణి ఈ మధ్య మరీ ఎక్కువైంది. టెక్సాస్ లో ఒక యువకుడు భారత జెండాను చించేస్తూ చూపించిన విద్వేషం సోషల్ మీడియాలో ఆగ్రహానికి కారణమైంది. ఈ పోకిరీకి తోడు చుట్టూ గుమిగూడిన అమెరికన్ పౌరులు.. వంత పాడుతూ పిచ్చి వెర్రితలలు వేసినట్లుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియన్స్ గో బ్యాక్.. అంటూ ఇండియన్ ఫ్లాగ్ ను చింపేస్తూ రచ్చ రచ్చ చేశాడు స్థానిక పౌరుడు. ఆ వీడియో క్లిప్ ను @ElijahSchaffer అనే ఎక్స్ యూజర్ షేర్ చేశాడు. ఈ ఘటన టెక్సాస్ లోని ఫ్రిస్కో లో జరిగింది. సిటీ హాల్ బయట కొందరు గుమిగూడగా అందులో ఒక ఆకతాయి భారత జెండాను చించేస్తూ ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. భారతీయులపై విద్వేషం వెల్లగక్కాడు. ఇండియన్స్ గో బ్యాక్ అని అరుస్తుంటే అక్కడున్న యువతీ యువకులు.. అవును వెళ్లాల్సిందే.. అంటూ స్లోగన్స్ ఇచ్చారు.
ఎక్స్ లో ప్రచారం అవుతున్న ఈ పోస్టు ఈ విధంగా ఉంది. “FRISCO: “Fck India! Fck India!" ఒక టెక్సాస్ నివాసి @Channel6ixNEWS.. సిటీ హాల్ ముందు భారత జెండాను చింపేస్తూ.. నార్త్ డల్లాస్ కు వలస వచ్చిన భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నట్లు ఎక్స్ లో పోస్టు చేశారు.
- ఎందుకు ఈ ద్వేషం:
టెక్సాస్‌లోని ఫ్రిస్కో, ప్లానో వంటి నగరాలు ఐటీ హబ్‌లుగా మారడంతో గత పదేళ్లలో భారతీయుల జనాభా అక్కడ ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ డెమోగ్రాఫిక్ మార్పులను అక్కడి కొందరు స్థానికలు జీర్ణించుకోలేకపోతున్నారు. హెచ్-1బీ వీసాల ద్వారా వచ్చి తమ ఉద్యోగాలను, ఇళ్లను లాగేసుకుంటున్నారనే నెపంతో.. సిటీ కౌన్సిల్ సమావేశాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ భారతీయులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒక దేశ అధికారిక పతాకాన్ని ముక్కలు చేస్తూ నినాదాలు చేయడం కేవలం వలసలపై వ్యతిరేకత మాత్రమే కాదు, అది స్పష్టమైన హేట్ క్రైమ్ ని అక్కడి ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- సోషల్ మీడియాలో రియాక్షన్స్:
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో.. వేల రియాక్షన్స్ వస్తున్నాయి. ఇండియన్ ఫ్లాగ్ ను చించేయడం బాధాకరం. అదే పని మేము చేసి ఉంటే.. అమెరికన్ ఫ్లాగ్ ను చించేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది..? అంటూ ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కరెక్టు కాదు.. ద్వేషం ఎప్పటికీ మంచిది కాదు. ఇక్కడికి వలస వచ్చిన వారు అక్రమంగా రాలేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. చట్టాలు, నిబంధనల ప్రకారమే వచ్చారు. మర్యాదగా, గౌరవంగా మీ వాయిస్ వినిపించాలి కానీ.. ఇలా కాదు అంటే డౌన్ థంబ్స్ ను చూపెట్టారు కొందరు ఇండియన్స్.
- ఇండియన్స్ మూర్ఖత్వాన్ని ప్రచారం చేస్తున్నారు:
ఇండియన్స్ కామెంట్స్ అమెరికన్స్ రిప్లై ఇచ్చారు. ఇండియన్ ఫ్లాగ్ ను చింపేయడం బాధిస్తుండొచ్చు. కానీ స్టుపిడ్ ఇండియన్స్ స్టుపిడిటీని (మూర్ఖత్వాన్ని) స్ప్రెడ్ చేస్తున్నారు. మీ హక్కులు మీకు ఉండొచ్చు.. ఎందుకంటే ఇండియా మీ దేశం. కానీ ఇలాంటి ద్వేషం అందరిపైకి రాకుండా చూసుకోండి అంటూ రిప్లై ఇచ్చారు.
మరొకరు ఈ విధంగా పోస్ట్ చేశారు.. కామెడీ ఏంటంటే.. పాలస్తీనా జెండాలను, పాకిస్తాన్ జెండాలను చించేసినప్పుడు సెలబ్రేట్ చేసుకున్న ఇండియన్సేనా ఇప్పుడు మాట్లాడుతున్నది.. ముస్లిం దేశాల జెండాలు చించేసినప్పుడు ఎగిరి గంతేసే మీరు.. ఇప్పుడు ప్రశ్నించడానికి అర్హులు కాదు.. ద్వేషం ఎప్పటికీ గెలవదు.. అంటూ పోస్ట్ చేశారు.
FRISCO: “F*ck India! F*ck India!”
— E (@ElijahSchaffer) June 3, 2026
A Texas resident @Channel6ixNEWS rips an Indian flag in front of city hall
Voicing anger against the Indian immigration invasion in north Dallas pic.twitter.com/N6Ec0oVSUT
