V6 News

డీఈఈసెట్‌‌కు 32,611 దరఖాస్తులు

డీఈఈసెట్‌‌కు 32,611 దరఖాస్తులు
  • నేడు, రేపు ఎడిట్ ఆప్షన్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32,611 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ జి. రమేశ్ గురువారం తెలిపారు. మార్చి15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్15తో ముగిసిందని చెప్పారు.

ఇంగ్లీష్ మీడియంకు 18,993 మంది, తెలుగు మీడియంకు 12,384 మంది, ఉర్దూ మీడియంకు 1,234 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ఈ నెల 17, 18 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించారు. అధికారిక వెబ్‌‌సైట్ https://deecet.cdse.telangana.gov.in లోకి వెళ్లి వివరాలను ఎడిట్ చేసుకోవాలని సూచించారు.