తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే TG EAPCET 2026 హాల్ టికెట్లు ఏప్రిల్ 23 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది ప్రభుత్వం. ఏప్రిల్ 23 నుంచి అగ్రికల్చర్ ఫార్మసీ విద్యార్థులకు హాల్ టికెట్స్ అందుబాటులో ఉండగా.. 27 నుండి ఇంజనీరింగ్ పరీక్షల హాల్ టికెట్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు అధికారులు. మే 4 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు 3 లక్షల 11 వేల 94 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
మే 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు..మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్స్ లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిచనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 115 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి

