హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ సెకండియర్‌లో నేరుగా ప్రవేశించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్ష శుక్రవారం జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా సెంటర్ లోపలికి అనుమతించమన్నారు. రిజిస్ట్రేషన్, ఫొటో క్యాప్చరింగ్ ప్రక్రియ ఉంటుందనీ, అభ్యర్థులు ఉదయం 7:30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షకు మొత్తం 18,626 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.
