హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)-2026 బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92.10 శాతం హాజరు నమోదైనట్లు ఎస్ బీటెట్ చైర్ పర్సన్ శ్రీదేవసేన తెలిపారు. మూడేళ్ల ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 1,06,439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 98,028 మంది హాజరయ్యారు. బాలుర విభాగంలో 56,491 మందికి 52,200 (92.40%) మంది పరీక్ష రాయగా, బాలికల విభాగంలో 49,948 మందికి గాను 45,828 (91.75%) మంది హాజరయ్యారు.
