V6 News

టెట్ అప్లికేషన్లు ప్రారంభం...తొలిరోజు 4,797 దరఖాస్తులు : టెట్ కన్వీనర్ జి.రమేశ్

టెట్ అప్లికేషన్లు ప్రారంభం...తొలిరోజు 4,797 దరఖాస్తులు : టెట్ కన్వీనర్ జి.రమేశ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) అప్లికేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం వరకూ మొత్తం 4,797 దరఖాస్తులు వచ్చాయని టెట్ కన్వీనర్ జి.రమేశ్ తెలిపారు. వీటిలో పేపర్-1కు 1,072 మంది, పేపర్-2కు 2,888 మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు కలిపి మరో 837 మంది అప్లై చేసుకున్నారు. మొదటిరోజే అప్లికేషన్ల సంఖ్య దాదాపు 5 వేల మార్కుకు చేరువ కావడం గమనార్హం. 

దోస్త్ రిజిస్ట్రేషన్లు షురూ..  

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ బుధవారం మొదలైంది. తొలిరోజు రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,337 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో డిగ్రీ సీట్ల కోసం విద్యార్థులు తొలిరోజే ఉత్సాహంగా దరఖాస్తులు చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి చెప్పారు.