- ఉదయనిధి విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడి
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పుల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే మధ్య విభేదాలు ముదిరాయి. కాంగ్రెస్‌ను ఇక ఏ మాత్రం నమ్మబోమని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. డీఎంకే శ్రేణుల వల్లే కాంగ్రెస్ ఐదు సీట్లు గెలిచిందని, ఇప్పుడు పదవుల కోసం తమకు చెప్పకుండా పారిపోయారని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. కష్టకాలంలో డీఎంకేకు అండగా నిలిచామని, ఉదయనిధి మాటలు అంగీకారయోగ్యం కావన్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోకుండా అడ్డుకోవడానికే విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపామని తెలిపారు.
