ఇరాన్పై మళ్లీ వైమానిక దాడులను ప్రారంభించడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ ఫొటోతో హింట్ ఇచ్చారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఎలాంటి సైనిక చర్య లేకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని ‘‘తుఫానుకు ముందు ప్రశాంతత’’ అని పేర్కొంటూ ఆయన ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా క్రియేట్ చేసిన ఫొటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వాషింగ్టన్: ఇరాన్‌పై మళ్లీ వైమానిక దాడులను ప్రారంభించడం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏఐ ఫొటోతో ట్రంప్ హింట్ ఇచ్చారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఎలాంటి సైనిక చర్య లేకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని ‘తుఫానుకు ముందు ప్రశాంతత’ అని పిలుస్తూ ఆయన ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా క్రియేట్ చేసిన ఫొటోను ట్రంప్ ఈ మేరకు శనివారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలో ఆయన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' టోపీ ధరించి, చూపుడు వేలితో హెచ్చరిస్తున్నట్టు కనిపించగా, అమెరికా నౌకాదళ అడ్మిరల్ ఆయన పక్కన నిలబడి ఉన్నారు. ఆ చిత్రంలో వారిద్దరూ అమెరికా నౌకపై ఉండి, వెనుక భాగంలో ఇరాన్ నౌకలు ఉన్నట్లు చూపించారు. దౌత్యపరమైన ప్రతిష్టంభనను సైనిక బలంతో బద్దలు కొట్టాలని ట్రంప్ నిర్ణయించుకుంటే, వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు అమెరికన్ మిలిటరీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఇరాన్పై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. శాంతి ఒప్పందం త్వరలో కుదరకపోతే ఇరాన్‌కు చాలా దారుణమైన పరిస్థితి ఉంటుందని కూడా ట్రంప్ ఇదివరకే హెచ్చరించడంతో ఈ ఫొటోతో ఆయన మళ్లీ యుద్ధం దిశగా హింట్ ఇచ్చారని భావిస్తున్నారు.
