మద్యం మత్తులో డ్రైవింగ్.. బాలికను ఢీకొట్టిన కారు

V6 Velugu Posted on Jun 23, 2021

కూకట్‌‌పల్లి: మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ ఒక బాలికను ఢీకొట్టిన ఘటన కూకల్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నోయిష్ (24) అనే సదరు వ్యక్తి తన స్నేహితులతో కలసి మద్య సేవించి హోండా సిటీ కారులో కూకట్‌పల్లి వైపు వెళ్తున్నాడు. కైత్లాపూర్‌ వద్ద‌ రోడ్డుపై వెళ్తున్న ఒక బాలికను నోయిష్ కారుతో ఢీకొట్టాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కారును వేగంగా నడిపి ఐడీఎల్ చెరువు రోడ్డు వైపు వెళ్లాడు. అయితే రోడ్డు మలుపు వద్ద బండి అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువతులు కూడా ఉన్నారని స్థానికులు తెలిపారు. నోయిష్‌‌ను పట్టుకున్న పోలీసులు.. స్టేషన్‌‌‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 

Tagged Hyderabad, investigation, POLICE, road accident, Arrested, Kukatpally

Latest Videos

Subscribe Now

More News