V6 News

యజమానిపై పగతో కారును తగలబెట్టాడు

యజమానిపై పగతో కారును తగలబెట్టాడు

యజమానిపై పగతో హైదరాబాద్ లో కారును తగలబెట్టాడు ఓ డ్రైవర్. దీంతో ఆ కారు పూర్తిగా కాలిపోయింది. కింగ్ కోఠిలో యజమాని మాజ్ అనే వక్తి రోడ్డు పక్కన కారు పార్కింగ్ చేశాడు. కారు పార్కింగ్ చేయడాన్ని చూసిన అతడి డ్రైవర్ హుస్సేన్ మరో ఇద్దరి యువకులతో కలిసి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కారు పూర్తిగా దగ్దమైపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన  ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. కారును తగలబెట్టిన హుస్సేన్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు హుస్సేన్ పై గతంలో కారు తగలబెట్టిన కేసు ఉందని చెప్పారు.