కాంగ్రెస్ ఒత్తిడితోనే క్యాంప్ ఆఫీస్ నుంచి కదిలిన కేసీఆర్

కాంగ్రెస్ ఒత్తిడితోనే క్యాంప్ ఆఫీస్ నుంచి కదిలిన కేసీఆర్

సీఎం కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ పై కేంద్రం విచారణ చేయించాలన్నారు పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర నిఘా సంస్థలకు కేసీఆర్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలు, వరదలొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. 10 రోజులపాటు జాతీయ రాజకీయాలు, పార్టీ విస్తరణపై చర్చించారని ఆరోపించారు. తమ ఒత్తిడితోనే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కదిలారని.. అయినా.. రైతులను ఆదుకునేందుకు ఎటువంటి ప్రకటన చెయ్యలేదన్నారు. ఇప్పటికైనా పంటనష్టం, ఆస్తినష్టంపై కేంద్రానికి నివేదికలిచ్చి.. రెండు, మూడు వేల సహాయం రాబట్టాలన్నారు రేవంత్. కాళేశ్వరం మునిగిపోయిందని.. అది తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్ ప్రయత్నం అన్నారు. వరదలొచ్చి మూడు రోజులైనా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్న రేవంత్ రెడ్డి.. వరదలు రావడానికి విదేశీ కుట్ర అన్న సీఎం ఈ విషయంపై కేంద్రానికి ఆధారాలివ్యాలని డిమాండ్ చేశారు.