
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, వాటి ఉప నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలివ్వాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ కి సీడబ్ల్యూసీ హైదరాబాద్ సెంటర్ డైరెక్టర్ ఎం. రఘురాం గురువారం లెటర్ రాశారు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలివ్వాలని కోరారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులు, ఇంకా పెండింగ్‌లో ఉన్నవి, ఎంత అడ్మిని స్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు? ఎంత వరకు పనులు పూర్తయ్యాయి? తదితర తెలియజేయాలని కోరారు. కేంద్ రం వివరాలడిగిన ప్రాజెక్టుల్లో కృష్ణా బేసిన్‌లోని పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌స్కీం , ఏఎమ్మార్ ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం లిఫ్ట్, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, తుమ్మిళ్ళ, ఆర్డీఎస్, గట్టు లిఫ్ట్ స్కీం ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్ల దేవాదుల మూడు ఫేజ్‌లు, ఎస్సారెస్పీ వరద కాలువ, ఎస్సారెస్పీ స్టేజ్ -2, సీతారామ, రోళవాగు, భక్తరామదాసు లిఫ్ట్, గుప్త, అలీ సాగర్, లెండి, లోయర్ పెన్‌గం గా, చనాక కొరాట బ్యారేజీ, తుపాకుల గూడెం, సదర్మాట్, కుంప్టి, ఎల్లంపల్లి ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్‌కు సన్నద్ధతలో భాగంగానే వివరాలు అడిగినట్టు సమాచారం.