దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోనుంది

దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోనుంది

నిజామాబాద్: దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోనుందన్నారు ఎంపీ అరవింద్. నాగార్జున సాగర్ ఎన్నికలో టీఆరెస్ అధికార దుర్వినియోగాయానికి పాల్పడుతుందని..ఇతర పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తమిళనాడు మ్యానిఫెస్టేలో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిందని తెలిపారు. బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించిందన్నారు. రీజనల్ స్పైసెస్ పార్క్ ద్వారా పసుపు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. దిగుబడులు నిలిపేయడంతో పసుపుకి ధర కూడా పెరిగిందన్నారు. జిల్లాలో బోర్డు కన్నా మంచి వ్యవస్థ పని చేస్తోందని..కేరళలో ఎన్నారై బోర్డు పెట్టినట్లు, పసుపు కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏదయినా ఉపాయం చేస్తే తప్పులేదు కదా? అన్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కేసీఆర్ విసిరే బిస్కట్లు తినే కుక్కలు అని...నన్ను విమర్శించటం తప్ప జిల్లా నేతలకు వేరే పనే లేదన్నారు. స్పైస్ బోర్డు లేఖ రాసి చాలా రోజులైనా కేసీఆర్ ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదన్నారు.  నిజాం షుగర్ ఫ్యాక్టరీ తేరుస్తానని కేసీఆర్ ఈ ప్రాంత చెరుకు రైతులను మోసం చేశారన్నారు. కేసీఆర్ కుటుంబానికి సిగ్గు, లజ్జ, మానం, ఇజ్జత్ మానవత్వం ఏమి లేవని..

నా పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడమే నా లక్ష్యం అన్నారు. జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని మంత్రి ప్రశాంత్ అడ్డుకుంటున్నారని..బెంగాల్ లో బీజేపీ గెలవడం ఖాయం అన్నారు. భైంసా లాంటి ఘటనలు హిందు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు.  హిందు వ్యతిరేఖులంతా గుళ్ళు, గోపురాలు తిరుగుతున్నారని..దేశంలో ఎన్ ఆర్సీ తక్షణమే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్ళటం ఖాయమని..షర్మిల కన్వర్షన్ క్వీన్, కవిత కమిషన్ క్వీన్..తెలంగాణ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అన్న వైఎస్ కూతురు ఇప్పుడు షర్మిల తెలంగాణలో వీసా తీసుకుని పార్టీ పెడుతున్నారా?అని ప్రశ్నించారు.  తెలంగాణలో షర్మిల మత మార్పిడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని..రోహింగ్యాలను ఎంకరేజ్ చేసే వారందరు దేశద్రోహులే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టం అన్నారు అరవింద్.