ఎమోషన్స్​ని చివరి వరకు బాగా క్యారీ చేశారు

ఎమోషన్స్​ని చివరి వరకు బాగా క్యారీ చేశారు

టైటిల్ ‌‌: లవ్ ‌‌ స్టోరీ ఇన్ ‌‌ రాజమండ్రి
కాస్ట్ ‌‌: విష్ణు కొమ్ముల, తేజస్వీ రావు, స్వర్ణ, ప్రసాద్ ‌‌ నిల్ల, రమేష్ ‌‌, గణేష్ ‌‌, లలిత, దుర్గా రావు, లాంగ్వేజ్:  తెలుగు
యూట్యూబ్ ‌‌ ఛానెల్ ‌‌: 16ఎంఎం క్రియేషన్స్ ‌‌ 
రన్ ‌‌టైం: 17 నిమిషాలు
డైరెక్షన్ ‌‌: తేజస్వీ రావు

రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతని పేరు దుశ్యంత్ ‌‌. ఏదో ఆలోచిస్తూ.. కూర్చున్న దుశ్యంత్ ‌‌ భుజాన్ని ఎవరో తట్టినట్టు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఆ చేయి ఒక అందమైన అమ్మాయిది. ఆమె పేరు సుజన. దుశ్యంత్ ‌‌ చాలా రోజుల నుంచి ఆమెను ప్రేమిస్తుంటాడు. అందుకే ఆమె తనతో మాట్లాడిన ప్రతిసారి తడబడుతుంటాడు. కానీ.. రైల్వే స్టేషన్​లో ఆమె కనిపించినప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. వెంటనే వెళ్లి లవ్ ‌‌ ప్రపోజ్ ‌‌ చేస్తాడు. సీన్ ‌‌ కట్ ‌‌ చేస్తే.. సుజన వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోతుంది. దుశ్యంత్ ‌‌ అక్కడికి వెళ్లి మరీ కలుస్తాడు. అతను చెప్పే మాటలు విని వెంటనే కొన్ని రోజుల్లోనే లవ్​లో పడిపోతుంది సుజన. తర్వాత అమ్మాయి ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకుంటారు. అంతా బాగానే ఉంది అనుకుంటుండగా దుశ్యంత్ ‌‌ వాళ్ల అమ్మ గురించి అతను దాచిన ఒక నిజం తెలుస్తుంది. దానివల్లే వాళ్లిద్దరు విడిపోవాల్సి వస్తుంది.  

యాక్టర్స్ ‌‌అందరూ బాగా నటించారు. ఎమోషన్స్​ని చివరి వరకు బాగా క్యారీ చేశారు. బలమైన కథతోపాటు మంచి డైలాగ్స్ ‌‌ఈ షార్ట్​ఫిల్మ్​కి ప్లస్ ‌‌పాయింట్స్. హీరో చివర్లో చెప్పే డైలాగ్స్ ‌‌చాలా బాగున్నాయి.