పోలీస్ కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ విభాగం కీలక పాత్ర

పోలీస్ కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ విభాగం కీలక పాత్ర

పలు క్రిమినల్ కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. టెక్నాలజీ సాయంతో క్లిష్టమైన కేసులను సైతం పోలీసులు సులభంగా చేదిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు కలెక్ట్  చేసి అనుమానితుల ఫింగర్స్ తో ప్రింట్  చెక్  చేస్తారు. ఇలా 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 480 కేసుల్లో నిందితులను ట్రేస్  చేసి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నేరస్థుల కోసం పాపిలాన్ యాప్ తో స్పెషల్  డ్రైవ్ చేస్తున్నారు. పాత నేరస్తులు, ప్రాపర్టీ అఫెండర్స్ ను ట్రేస్  చేసేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పబ్లిక్  ప్లేస్ లో ఫింగర్ ప్రింట్స్ పై స్పెషల్  డ్రైవ్  నిర్వహిస్తున్నారు. స్థానిక బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ టీమ్స్ తో అనుమానితుల ఫింగర్   ప్రింట్స్ చెక్ చేస్తున్నారు. ఓల్డ్ అఫెండర్స్  డేటాతో షాపింగ్ మాల్స్ , హోల్ సేల్  మార్కెట్స్ లో నిఘాపెట్టారు. పాపిలాన్  ఆటోమేటిక్ ఫింగర్  ఫ్రింట్  ఐడెంటిఫికేషన్  సిస్టమ్ తో పాత నేరస్తులను ట్రేస్  చేస్తున్నారు. 
 
క్రైమ్ అండ్  క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ తో దేశవ్యాప్తంగా నిందితుల డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. అనుమానితుల ఆధార్, ఫింగర్ ప్రింట్  స్కానింగ్ తో నిందితుల క్రిమినల్ రికార్డ్స్ కలెక్ట్  చేస్తున్నారు. దీని కోసం సీన్  ఆఫ్  అఫెన్స్ లో నిందితుల ఫింగర్ ప్రింట్ స్లిప్స్, ఫొటోలను లైవ్ డిజిటల్ స్కానర్లతో రికార్డ్  చేస్తున్నారు.  క్రిమినల్  కేసుల్లో వాంటెండ్ గా ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా గత వారం రోజులుగా సిటీ కమిషనరేట్ పరిధిలో 15మంది ప్రాపర్టీ అఫెండర్స్ ను గుర్తించారు. పబ్లిక్  ప్లేస్ లో చైన్, మొబైల్  స్నాచర్స్ పై నిఘాపెట్టారు పోలీసులు. ఇందులోభాగంగా సుల్తాన్ బజార్   పోలీస్  స్టేషన్  పరిధిలోని రిటైల్ మార్కెట్స్ లో స్పెషల్ డ్రైవ్  నిర్వహించారు. చైన్, సెల్ ఫోన్  స్నాచర్స్  డేటా ఆధారంగా చెక్ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి ఫొటోతో పాటు.. ట్యాబ్ లోని పాపిలాన్ యాప్ తో క్రిమికల్ హిస్టరీ పరిశీలిస్తున్నారు. ఫింగర్ ప్రింట్  బ్యూరో కోసం ఎంపికైన 25మంది ఎస్ఐలకు స్పెషల్  ట్రైనింగ్  ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్స్ పరిధిలోని యూనిట్స్ లో పోస్టింగ్స్  ఇచ్చారు. నిందితుల మూమెంట్స్, మోడాస్ ఆపరెండీ, అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ క్యాప్చర్ చేయడంపై వారికి ట్రైనింగ్ ఇచ్చారు. కేసుల దర్యాప్తులో పాపిలాన్  యాప్ ను ఉపయోగిస్తున్నారు పోలీసులు.

‘పాపిలాన్ హై ప్రిక్వేన్సీ’ ఫింగర్ ప్రింట్ సిస్టమ్  కోసం స్పెషల్  టీమ్స్  ఫామ్ చేస్తున్నారు. ఒక్కో టీమ్ లో ఇన్ స్పెక్టర్ , ముగ్గురు ఎస్సైలు ఆన్  డ్యూటీలో ఉంటారు. పోలీస్  ట్రైనింగ్ లో ఫింగర్   ప్రింట్స్  కలెక్షన్,  ట్రేసింగ్ పై శిక్షణ పొందిన ఎస్ ఐలకు ఓల్డ్  అఫెండర్స్  డేటాను అప్ లోడ్  చేసే బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు సీన్  ఆఫ్  అఫెన్స్ లో సేకరించిన క్లూస్ తో అనుమానితుల ప్రింట్స్ మ్యాచ్ చేసి నేరస్తులను గుర్తిస్తున్నారు. ప్రతీ కమిషనరేట్ లో జోన్ కి ఒక్కో యూనిట్  క్రియేట్  చేశారు అధికారులు. ట్రైనింగ్  పొందిన 25మంది ఎస్ఐలు బ్యూరోలో కొత్తగా  చేరారు. రాష్ట్ర ఫింగర్  ప్రింట్స్  బ్యూరోలో సుమారు 9లక్షల 3వేల ఫింగర్ ప్రింట్స్  ఉన్నాయి. ఫైన్  ట్యూనింగ్ తో బెటర్ క్వాలిటీ ఫింగర్  ప్రింట్స్  డేటా కలెక్ట్  చేస్తున్నారు. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 480 కేసులను ఫింగర్ ప్రింట్స్  డేటా ద్వారా పోలీసులు ట్రేస్  చేశారు.  మొత్తానికి పోలీసులు టెక్నాలజీ సాయంతో నేరస్తులను పట్టుకుంటున్నారు. మరింత అభివృద్ధి చెందిన సాంకేతికను వాడుకొని ముందుకు వెళ్తున్నారు.