కృష్ణా ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్‌

కృష్ణా ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్‌
  • గోదావరి బేసిన్‌లోనూ భారీ వరద

హైదరాబాద్‌, వెలుగు: కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్లను మళ్లీ ఓపెన్‌ చేశారు. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. జూరాల క్యాచ్‌మెంట్‌లో భారీ వానలు పడటంతో ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 1.85 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి 1.99 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలంలోని 3.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా 4 లక్షల క్యూసెక్కులను, నాగార్జునసాగర్‌కు 2.85 క్యూసెక్కులు వస్తుండగా 3.41 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. గోదావరి బేసిన్‌లో కడెం మినహా మిగతా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఎస్సారెస్పీకి 1.36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. మిడ్‌ మానేరుకు 9,818 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని, ఎల్‌ఎండీకి 46 వేల క్యూసెక్కులకు పైగా వస్తుండగా అంతే నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా 1.77 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.