ఉస్మానియా హాస్పిటల్ ను బాగు చేస్తారా? లేదంటే కొత్తగా నిర్మిస్తారా?

ఉస్మానియా హాస్పిటల్ ను బాగు చేస్తారా? లేదంటే కొత్తగా నిర్మిస్తారా?

ఆసుపత్రిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని, అలాగే చారిత్రక ఉస్మానియా ఆస్పత్రిని కూల్చవద్దన్న రెండు పిల్స్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఉస్మానియాపై వ్యాజ్యాలన్ని కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిని బాగు చేస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. నాలుగు వారాల్లో ప్రభుత్వం వైఖరి వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. వారసత్వ కట్టడాలు కూల్చవద్దన్న వాదనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఆదేళ్లుగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.