కార్పొరేట్ కాలేజీ చదువుల నేపథ్యంలో ‘తీహార్ కాలేజ్

కార్పొరేట్ కాలేజీ చదువుల నేపథ్యంలో ‘తీహార్ కాలేజ్

సొంతవూరు, గల్ఫ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు సునీల్ కుమార్‌‌‌‌ రెడ్డి.. ఈసారి కార్పొరేట్ కాలేజీ చదువుల నేపథ్యంలో ‘తీహార్ కాలేజ్’ చిత్రాన్ని తీశారు. మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, కృష్ణతేజ, సోనీ రెడ్డి, మనీషా ముఖ్య పాత్రలు పోషించారు. డాక్టర్ ఎల్.ఎన్.రావు, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు. ఈ నెల 28న సినిమా విడుదల. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘బతకడానికి ధైర్యం ఇవ్వాల్సిన చదువే చావుకు కారణమవుతోంది.

ఏ ఒక్క స్టూడెంట్‌‌ సూసైడ్ చేసుకున్నా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫెయిలైనట్టే. ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగమే మా సినిమా. స్టూడెంట్స్, లెక్చెరర్స్, కాలేజ్ మేనేజ్‌‌మెంట్స్, గవర్నమెంట్‌‌తో సహా అందరినీ సమన్వయపర్చే ప్రయత్నమిది’ అన్నారు. ‘చక్కని కంటెంట్‌‌, సోషల్ మెసేజ్‌‌తో వస్తున్న ఈ మూవీ ఫుల్లుగా ఎంటర్‌‌‌‌టైన్ కూడా చేస్తుంది’ అన్నాడు మనోజ్ నందన్. హీరోయిన్‌‌తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.