18 వేల ఏండ్ల నాటి శంఖం

18 వేల ఏండ్ల నాటి శంఖం

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శంఖాన్ని ఫ్రాన్స్ రీసెర్చర్స్ గుర్తించారు. ఫ్రాన్స్‌‌లోని మార్సౌలాస్ గుహల్లో ఇది దొరికింది. 12.2 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పు ఉన్న ఈ శంఖం 18 వేల ఏండ్ల క్రితం నాటిదని సైంటిస్టులు తేల్చారు. కార్బన్ డేటింగ్ ద్వారా దీని ఏజ్‌‌ను గుర్తించారు. వాస్తవానికి ఈ శంఖం 1931లోనే మార్సౌలాస్ గుహల్లో దొరికింది. అయితే 80 ఏండ్లుగా మ్యూజియంలో ఉన్న దీనిని రీసెంట్‌‌గా మళ్లీ బయటకు తీసి ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్), యూనివర్సిటీ ఆఫ్ టౌలోస్ జీన్ సైంటిస్టులు కలిసి అనాలసిస్ మొదలుపెట్టారు.

కొద్ది రోజుల క్రితం ఒక హార్న్ ప్లేయర్‌‌‌‌ను పిలిపించే అతడితో శంఖం ఊదించి, రికార్డ్ చేశారు. అలాగే శంఖం దొరికిన గుహలో కొన్ని ఆర్ట్స్ చెక్కి ఉండడాన్ని సైంటిస్టుల గుర్తించారు. ఈ ఆర్ట్స్‌‌కు, శంఖారావానికి మధ్య కచ్చితంగా సంబంధం ఉందని, దానిని తేల్చేందుకు రీసెర్చ్ కంటిన్యూ చేస్తామని సైంటిస్టులు చెబుతున్నారు. పూర్వం ఈ శంఖాన్ని మ్యూజిక్ ఇన్‌‌స్ట్రూమెంట్‌‌గా, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు హెచ్చరించే సాధనంగా కూడా వాడే వారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాచీన యూరోప్‌‌, రాతియుగ నాగరికతలకు సంబంధించిన ఫ్లూట్స్ మాత్రమే గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో ఇదే అతి పురాతనమైన శంఖం.