తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్ వాయిదా

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్ వాయిదా

రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ను వారం రోజుల పాటు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు  వాయిదా వేసింది. ఈనెల 21న జరగాల్సిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 15 వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఏప్రిల్ లో TSLPRB నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్ ను ఈనెల 21న ఆదివారం నిర్వహించాల్సి ఉంది. 

ఈనెల 28న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అలాగే హాల్ టికెట్స్ ను ఈనెల 18 నుంచి వెబ్ సైట్లో  డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.