యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటం, మేకర్స్ నుండి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.
సినిమా అవుట్‌పుట్ పట్ల యశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే పలు కీలక సీన్లను మళ్లీ రీషూట్ చేయాలని పట్టుబడుతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన మూవీ టీమ్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం నిరాధారమైన వార్తలని, జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నూటికి నూరు శాతం కంప్లీట్ అయ్యాయని, అలాంటప్పుడు రీషూట్‌కు ఆస్కారమే లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రలో కనిపించనున్నారు. యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
