ఆర్టీసీ టికెట్‌‌ బేసిక్‌‌ ఛార్జీ తగ్గింపు?

ఆర్టీసీ టికెట్‌‌ బేసిక్‌‌ ఛార్జీ తగ్గింపు?

హైదరాబాద్‌‌, వెలుగు: బేసిక్​ చార్జిపై సెస్​తగ్గించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇటీవల టికెట్ ​ధరలు పెంచిన నేపథ్యంలో చిల్లర సమస్య లేకుండా రౌండప్‌​ చేశారు. దీనికి ప్యాసింజర్​ సెస్ ​యాడ్​ కావడంతో టికెట్​ ధర అబ్​నార్మల్​గా పెరిగిపోయింది. ఉదాహరణకు.. రూ.10 టికెట్‌‌కు కిలోమీటర్‌‌కు 20పైసల చొప్పున పెంచడంతో దూరాన్ని బట్టి రూ.15గా అయింది. ప్యాసింజర్‌‌ సెస్‌‌ ఒక రూపాయి యాడ్‌‌ చేస్తే రూ.16.. దీనిని రౌండప్‌​ చేస్తే రూ.20 కి చేరింది. అంతకుముందు రూ.10 గా ఉన్న టికెట్​ ధర ఇప్పుడు రూ.20 గా మారింది. దీంతో ప్యాసింజర్​ సెస్‌‌ను ఇందులో చేర్చొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్‌‌ 30న విడుదలైన సర్క్యూలర్‌ తాజాగా బయటకు వచ్చింది. దీనిని అమలుచేస్తే కనీస చార్జి తిరిగి రూ.15 అయ్యే ఛాన్స్‌‌ ఉంది. డీలక్స్‌‌, సూపర్‌‌ లగ్జీరీ బస్‌ ఫేర్‌లకూ ఈ రూల్ వర్తించనుంది. అయితే, ఆర్టీసీ అధికారులు మాత్రం అది ఇంటర్నల్‌‌ సర్క్యూలర్‌ అని, టికెట్‌‌ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం.