ఇయ్యాల ఎస్​సీవో సమ్మిట్

ఇయ్యాల ఎస్​సీవో సమ్మిట్

న్యూఢిల్లీ: మన దేశ ఆధ్వర్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సమ్మిట్ మంగళవారం వర్చువల్ గా జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మీటింగ్ లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇరాన్ కు పర్మనెంట్ మెంబర్ షిప్ ఇవ్వనున్నారు. అఫ్గానిస్తాన్, ఉక్రెయిన్​లో పరిస్థితులు, రీజినల్ సెక్యూరిటీ, వ్యాపార సంబం ధాలపై మీటింగ్​లో చర్చించే అవకాశం ఉంది. 

కాగా, ఎస్​సీవోలో మన దేశం తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 16న ఉజ్బెకిస్తాన్​లో  జరిగిన సమ్మిట్​లో మన దేశం ఎస్ సీవో అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది.