హైదరాబాద్, వెలుగు: పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. ఇందుకోసమే కీసరలో బుధ, గురువారాల్లో నవ సంకల్ప్ మేథో మధన శిబిరం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం ఆరు కమిటీలను వేసినట్లు తెలిపారు.

