మరో ఐదు పన్నులకు  వన్ టైమ్ సెటిల్‌‌మెంట్ స్కీమ్‌‌

మరో ఐదు పన్నులకు  వన్ టైమ్ సెటిల్‌‌మెంట్ స్కీమ్‌‌
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

హైదరాబాద్ , వెలుగు : వన్ టైమ్ సెటిల్‌‌మెంట్ స్కీమ్‌‌ను  మరో ఐదు రకాల పన్నులకు వర్తింపజేస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లగ్జరీ టాక్స్, ఎంటర్‌‌టెయిన్‌‌మెంట్ టాక్స్, ఆర్డీ సెస్, ప్రొఫెషనల్ టాక్స్, మోటారు వాహనాల ఎంట్రీ టాక్స్ తదితర మొండి బకాయిలకు కూడా  స్కీమ్ వర్తిస్తుందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. బకాయిల్లో 50% చెల్లిస్తే చాలని, మిగిలినది రాయితీగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గత నెల 9న జారీ చేసిన జీవో ప్రకారం వన్ టైమ్ సెటిల్‌‌మెంట్ కోరుకునే బకాయిదారులు పంద్రాగస్టులోపు బకాయిలు చెల్లించాలని తెలిపారు. గడువు విషయంలో మాత్రం ఎలాంటి అదనపు అవకాశాలను సర్కారు కల్పించలేదు. ఒకవేళ బకాయిదారులు పై ఐదు రకాల పన్నులను చెల్లించి వాటి మీద వడ్డీ మాత్రమే చెల్లించకుండా పెండింగ్‌‌లో పెట్టినట్లయితే కేవలం 15% మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.