విద్యార్థి వస్తున్నాడు 

విద్యార్థి వస్తున్నాడు 

చేతన్‌‌, బన్నీవోక్స్‌‌ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో ఆళ్ల వెంకట్‌‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్‌‌ పోస్టర్‌‌ను శనివారం విడుదల చేస్తూ, ఈ నెల 29న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా చేతన్ శీను మాట్లాడుతూ ‘ప్రతి ప్రాంతంలో జరిగే  అంశాన్ని తీసుకుని దర్శకుడు కథ రాశారు. సింగిల్ షెడ్యూల్‌‌లో షూటింగ్ పూర్తి చేశాం. ఈ సినిమా మా అందరి తలరాతను మారుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. ‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. విడుదల చేస్తున్న డి.ఎస్.రావుకి థ్యాంక్స్’ అని చెప్పాడు.