ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ప్రభుత్వం

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ప్రభుత్వం
  • బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి సబిత విజ్ఞప్తి 

హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక ఏర్పడింది. జోరుగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా విద్యార్థులు నిరసన కొనసాగించడం.. గవర్నర్ సహా ప్రతిపక్షాలు విమర్శించడం.. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ నేపధ్యంలో ఇంచార్జ్ వీసీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర విద్యార్థుల ఆందోళన..ట్రీపుల్ ఐటీలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై ట్వీట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై సమావేశంలో చర్చించామని.. పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. విద్యార్థులు వెంటనే ఆందోళన విరమించాలని మంత్రి సబితా ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.