కిషన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన ఆర్టీసీ

కిషన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన ఆర్టీసీ

సెప్టెంబర్ 17న కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి బస్సులు కావాలని టీఎస్ఆర్టీసీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ.. బస్సులు లేవని రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకుందని తెలిపింది. అధికారికంగా బస్సులు లేవని లెటర్ ఇవ్వాలని కిషన్ రెడ్డి అడగ్గా.. చూస్తామని చెప్పి సమాధానం దాటవేసింది.

అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కేంద్రబలగాలతో పరేడ్ నిర్వహించనుండగా.. అమిత్ షా గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ లిబరేషన్‌ డేను సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 అంటే ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు సైతం పాల్గొననున్నారు.