పరిహారం ఇచ్చేవరకు కదలం

పరిహారం ఇచ్చేవరకు కదలం

ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ఆఫీసర్లు
ఊర్లోనే ఉంటామన్న గ్రామస్థుల

జగిత్యాల /వెల్గటూర్, వెలుగు: బ్యాక్ వాటర్ తో గ్రామం మునుగుతుందని, ఖాళీ చేయాలని అధికారులు చెప్పగా.. పరిహారం ఇచ్చేవరకు ఖాళీ చేయమని గ్రామస్థులు పేర్కొన్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాంలో చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ తో గ్రామం ముంపునకు గురవుతుందని, ఇండ్లు శిథిలావస్థకు చేరిన 30 కుటుంబాలు ఉన్న ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. పరిహారం ఇచ్చేవరకు గ్రామాన్ని వదలబోమని గ్రామస్థులు తేల్చిచెప్పారు. ప్రాజెక్టు పూర్తయి ఏండ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని అన్నారు. మేమేమైన బిచ్చగాళ్ల‌మా మీరు ఏది చెప్తే అది వినడానికి అని అధికారులను నిలదీశారు. అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి సీరియస్ గా ఉన్న నాలుగు ఇండ్లకు అధికారులు తాళాలు వేయడంతో ఆ కుటుంబాలు ఊళ్లోనే వేరేచోట ఉన్నారు. మరికొందరు స్కూల్ ఆవరణలో ఉన్నారు. దాంతో అధికారులు గ్రామం నుంచి వెనుదిరిగారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..