థియేటర్లు ఓపెన్ చేస్తాం…సర్కార్ రాయితీలివ్వాలి

థియేటర్లు ఓపెన్ చేస్తాం…సర్కార్ రాయితీలివ్వాలి

సినిమా థియేటర్స్ ఓపెన్ కు అనుమతితో పాటు రాయితీలివ్వాలని కోరింది తెలంగాణ  థియేటర్ ఓనర్స్ అసోసియేషన్. థియేటర్లు ప్రారంభించేందుకు సుదర్శన్ థియేటర్ లో తెలంగాణా థియేటర్ ఓనర్స్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ..పార్కింగ్ , కరెంట్ విషయంలో తెలంగాణా ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. అక్టోబర్ 15నుంచి కేంద్రం అనుమతి ఇచ్చిందని..తెలంగాణా ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలన్నారు.  ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. పార్కింగ్ రుసుము వసూలు చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతించాలన్నారు.

వికారాబాద్ లో మహిళను హత్యచేసి పూడ్చి పెట్టిన దుండగులు

24 గంటల్లో 79,476 కేసులు..1069 మరణాలు

రాష్ట్రంలో 1,718 కొత్త కరోనా కేసులు